శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ మంగళవారం నాడు ఆలయానికి విచ్చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ మీడియా అధికార ప్రతినిధి నాగమల్లి దుర్గాప్రసాద్, బాలాజీ రెడ్డీ లు సాదర స్వగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వదించి వాయులింగేశ్వరుని తీర్థప్రసాదాలు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాపికను ఆలయ నిర్వాహకులు కళ్యాణ్ రామ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు భారీగా పాల్గొన్నారు.

ముక్కంటిని దర్శించిన సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్