(పున్నమి ప్రతినిధి)
నరసరావుపేట టౌన్, జనవరి 06: స్థానిక చిలకలూరిపేట రోడ్డులోని అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధాశ్రమంలో యస్.యస్.&యన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చంట్స్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కపలవాయి విజయకుమార్ గారి 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ది టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ–మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయకుమార్ కేక్ కట్ చేసి వృద్ధులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కృష్ణ–మహేష్ బాబు అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.



