Sunday, 22 March 2026
  • Home  
  • ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.
- E-పేపర్

ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం.

రౌతులపూడి,( పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 05: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రశ్నాత్మకంగా చేపట్టిన మెగా( పిటిఎం ) తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మండలంలోని రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులచే పలు సంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి పాఠశాలను తలదన్నేలా ఈ మెగాపిటీఎం నిర్వహించిన స్కూలు ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబును పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని తద్వారా వాళ్ల ఉన్నతికి తోడ్పడిన వారు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పైల సాంబశివరావు, మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి భాస్కర బాబు, నీటి సంఘాల చైర్మన్ పైల రాజేష్, శెట్టి రమణ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బండారు సత్తిబాబు, మండల విద్యాశాఖ అధికారులు సతీష్ బాబు, గాడి కొండబాబు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగమణి, వెంకటలక్ష్మి ములకపూడి పీహెచ్సీ డాక్టర్ సౌందర్య, మరియు స్కూలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రౌతులపూడి,( పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 05:

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రశ్నాత్మకంగా చేపట్టిన మెగా( పిటిఎం ) తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మండలంలోని రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులచే పలు సంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి పాఠశాలను తలదన్నేలా ఈ మెగాపిటీఎం నిర్వహించిన స్కూలు ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబును పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని తద్వారా వాళ్ల ఉన్నతికి తోడ్పడిన వారు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పైల సాంబశివరావు, మాజీ ఎంపీపీ ఇట్టం శెట్టి భాస్కర బాబు, నీటి సంఘాల చైర్మన్ పైల రాజేష్, శెట్టి రమణ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బండారు సత్తిబాబు, మండల విద్యాశాఖ అధికారులు సతీష్ బాబు, గాడి కొండబాబు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగమణి, వెంకటలక్ష్మి ములకపూడి పీహెచ్సీ డాక్టర్ సౌందర్య, మరియు స్కూలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.