Thursday, 5 February 2026
  • Home  
  • ప్రతినెలా 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్: పంతగాని నరసింహ ప్రసాద్
- అన్నమయ్య

ప్రతినెలా 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్: పంతగాని నరసింహ ప్రసాద్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిన విజయమిది – నాగవరంలో పెన్షన్ పంపిణీ చిట్వేల్, డిసెంబర్ 1: పున్నమి ప్రతినిధి ప్రతి నెల మొదటి తేదీన ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు. చిట్వేల్ మండలం, నాగవరం గ్రామంలో సోమవారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వాన, వరద, తుఫాను వంటి ప్రకృతి విపత్తులు ఏవి వచ్చినా ఆగదని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతినెలా నిర్ణీత తేదీన పెన్షన్ డబ్బులు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిన విజయమిది – నాగవరంలో పెన్షన్ పంపిణీ

చిట్వేల్, డిసెంబర్ 1: పున్నమి ప్రతినిధి

ప్రతి నెల మొదటి తేదీన ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు. చిట్వేల్ మండలం, నాగవరం గ్రామంలో సోమవారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వాన, వరద, తుఫాను వంటి ప్రకృతి విపత్తులు ఏవి వచ్చినా ఆగదని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతినెలా నిర్ణీత తేదీన పెన్షన్ డబ్బులు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.