నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి)
👉 వంగమర్తి గ్రామం నుండి చిత్తలూరు వరకు (ఆర్ అండ్ బి రోడ్డు )
👉 శాలిగౌరారం నుండి భైరవుని బండ వయా అమ్మనబోలు (ఆర్ అండ్ బి రోడ్డు )
👉 గురజాల నుండి ఉప్పలంచ (పి అండ్ ఆర్ రోడ్డు )
👉 దోనబండ ఎక్స్ రోడ్డు నుంచి సాకర్ల (శాలిగౌరారం) వరకు (పి అండ్ ఆర్ రోడ్డు )
రోడ్ల నిర్మాణం కోసం త్వరగా నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి బుధవారం హైదరాబాదులో గౌరవ భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.దీనికి ఎంపీ గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే రోడ్లు మంజూరు అవతాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు. ఎంపీ గారిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతా ధనంజయ,వడ్లకొండ పరమేష్, ఇంద్రకంటి యాదయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు.


