Thursday, 12 February 2026
  • Home  
  • ప్రధమ భారత విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి.
- Blog

ప్రధమ భారత విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి.

భారత దేశ ప్రధమ విద్యామంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్ లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ల జోన్ చైర్మన్ నిజాముద్దీన్ సౌజన్యంతో ఇద్దరు పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేశారు. విద్యార్థుల తరఫున వారి తండ్రులు నగదు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ ప్రధమ విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్యం తర్వాత దేశంలో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, విద్యార్థుల తండ్రులు మధు, రాజ్ కుమార్ పాల్గొన్నారు

భారత దేశ ప్రధమ విద్యామంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు.
స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్ లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ల జోన్ చైర్మన్ నిజాముద్దీన్ సౌజన్యంతో ఇద్దరు పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేశారు. విద్యార్థుల తరఫున వారి తండ్రులు నగదు స్వీకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ ప్రధమ విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్యం తర్వాత దేశంలో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, విద్యార్థుల తండ్రులు మధు, రాజ్ కుమార్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.