Sunday, 22 March 2026
  • Home  
  • నారాయణ తపోవన ఆశ్రమంలో భక్తి సముద్రం – కార్తీక పౌర్ణమి వేళ అన్నదాన మహోత్సవం
- అన్నమయ్య

నారాయణ తపోవన ఆశ్రమంలో భక్తి సముద్రం – కార్తీక పౌర్ణమి వేళ అన్నదాన మహోత్సవం

అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని తిమ్మాయపాలెం క్రాస్ సమీపంలోని పవిత్ర పుణ్యక్షేత్రం నారాయణ తపోవన ఆశ్రమం భక్తి వాతావరణంతో కిక్కిరిసిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజామున నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నారాయణ స్వామివారి దర్శనార్థం క్యూల్లో నిలబడి భక్తులు నామస్మరణతో పరవశించగా, ఆశ్రమం అంతటా వేదమంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ సందర్భంగా కె.వి.పి. సుబ్బయ్య తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఘనమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తూ, పాలు – పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆశ్రమ నిర్వాహణ బాధ్యతలు చేపట్టిన రాజుగుంట గ్రామానికి చెందిన కనకరాజు మాట్లాడుతూ – “నారాయణ తపోవన ఆశ్రమం మన ప్రాంతానికి ఆధ్యాత్మిక కాంతివంతమైన కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్ర, వెంకటసుబ్బయ్య, గణేష్, పసల ప్రసాద్ తదితరులు పాల్గొని సేవలు అందించారు. స్థానిక గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై భజనలతో, హారతులతో, నామసంకీర్తనలతో తపోవన ఆశ్రమాన్ని ఆధ్యాత్మికతతో నింపేశారు. కార్తీకమాసం చివరి పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సేవా భావాలతో చిట్వేల్ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించింది.

అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని తిమ్మాయపాలెం క్రాస్ సమీపంలోని పవిత్ర పుణ్యక్షేత్రం నారాయణ తపోవన ఆశ్రమం భక్తి వాతావరణంతో కిక్కిరిసిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు వైభవంగా నిర్వహించగా, తెల్లవారుజామున నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

నారాయణ స్వామివారి దర్శనార్థం క్యూల్లో నిలబడి భక్తులు నామస్మరణతో పరవశించగా, ఆశ్రమం అంతటా వేదమంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ సందర్భంగా కె.వి.పి. సుబ్బయ్య తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఘనమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తూ, పాలు – పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు.

ఆశ్రమ నిర్వాహణ బాధ్యతలు చేపట్టిన రాజుగుంట గ్రామానికి చెందిన కనకరాజు మాట్లాడుతూ – “నారాయణ తపోవన ఆశ్రమం మన ప్రాంతానికి ఆధ్యాత్మిక కాంతివంతమైన కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చంద్ర, వెంకటసుబ్బయ్య, గణేష్, పసల ప్రసాద్ తదితరులు పాల్గొని సేవలు అందించారు. స్థానిక గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై భజనలతో, హారతులతో, నామసంకీర్తనలతో తపోవన ఆశ్రమాన్ని ఆధ్యాత్మికతతో నింపేశారు.

కార్తీకమాసం చివరి పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సేవా భావాలతో చిట్వేల్ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.