విశాఖ గాజువాక నవంబర్ (పున్నమి ప్రతినిధి):
అవినీతి నిరోధక శాఖ సంచలన సోదాలు – పలు కార్యాలయాల్లో రికార్డుల తనిఖీ
విశాఖ జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏకకాలంలో మధురవాడ జోన్–1, జోన్–2, పెదగంట్యాడ, ఆనందపురం తదితర కార్యాలయాల్లో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ దాడుల సందర్భంగా అధికారులు రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, లావాదేవీలపై సమగ్రంగా పరిశీలనలు చేపట్టారు.
దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం కొన్ని అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది.


