Friday, 13 February 2026
  • Home  
  • మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు* *4వ డివిజన్‌లో డీఎంఎస్‌ విజయం సంఘం విజయవాడ గ్రాండ్‌ బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*
- ఎన్ టి ఆర్ జిల్లా

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు* *4వ డివిజన్‌లో డీఎంఎస్‌ విజయం సంఘం విజయవాడ గ్రాండ్‌ బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీలో డీఎంఎస్‌ విజయం సంఘం, విజయవాడ గ్రాండ్‌ బజార్‌ కు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని 1995వ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచించి డ్వాక్రా వ్యవస్థను అమలు చేశారన్నారు. అన్న ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తి హక్కులో వాటా కల్పించారన్నారు. ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లు మొత్తం చదువుకున్నట్లేనని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన డ్వాక్రా గ్రూపు వ్యవస్థ ద్వారా నేడు మహిళలు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారన్నారు. నేడు బ్యాంకు ఉద్యోగులందరూ బిజీగా ఉండడానికి, బ్యాంకుల పనితీరు బాగుండడానికి ఒక కారణం డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో నిర్వహిస్తున్న లావాదేవీలేనని అభిప్రాయపడ్డారు. మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. డీఎంఎస్‌ విజయం సంఘం, విజయవాడ గ్రాండ్‌ బజార్‌ అధ్యక్షురాలు పీ.నళిని మాట్లాడుతూ మహిళలను ఉపాధి చూపించి వారికి జీవనోపాధి కల్పించడానికి తమ సంఘం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్‌ బజార్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, కోశాధికారి స్వన్న, గ్రోత్‌ ఆఫీసర్‌ వీవీఎన్‌. లక్ష్మి, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ నీలిమ పాల్గొన్నారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.
ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీలో డీఎంఎస్‌ విజయం సంఘం, విజయవాడ గ్రాండ్‌ బజార్‌ కు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని 1995వ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచించి డ్వాక్రా వ్యవస్థను అమలు చేశారన్నారు. అన్న ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తి హక్కులో వాటా కల్పించారన్నారు. ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లు మొత్తం చదువుకున్నట్లేనని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన డ్వాక్రా గ్రూపు వ్యవస్థ ద్వారా నేడు మహిళలు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారన్నారు. నేడు బ్యాంకు ఉద్యోగులందరూ బిజీగా ఉండడానికి, బ్యాంకుల పనితీరు బాగుండడానికి ఒక కారణం డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో నిర్వహిస్తున్న లావాదేవీలేనని అభిప్రాయపడ్డారు. మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.
డీఎంఎస్‌ విజయం సంఘం, విజయవాడ గ్రాండ్‌ బజార్‌ అధ్యక్షురాలు పీ.నళిని మాట్లాడుతూ మహిళలను ఉపాధి చూపించి వారికి జీవనోపాధి కల్పించడానికి తమ సంఘం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గ్రాండ్‌ బజార్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, కోశాధికారి స్వన్న, గ్రోత్‌ ఆఫీసర్‌ వీవీఎన్‌. లక్ష్మి, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ నీలిమ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.