అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసిలాట ఘటనలో భక్తులు దుర్మరణం చెందడం పట్ల వారికి సానుభూతి వ్యక్తం చేస్తూ,వారి ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారి ఆధ్వర్యంలో అరకులోయ ప్రధాన కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మరియు ఈ ఘటన లో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ అరకులోయ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, మాజీ విశాఖపట్నం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, వైసీపీ అరకులోయ మండల పార్టీ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, వైసీపీ అరకు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు నరసింగ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, బస్కి గ్రామపంచాయతీ సర్పంచ్ రమేష్, మడగడ గ్రామ పంచాయతీ సూపర్ సర్పంచ్ బాలరాజు, సుంకర మెట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కొర్ర అర్జున్ రావు, వైసిపి నేతలు గుంజేడి ప్రసాద్, కామేష్, లబుడు బారికి కిరణ్ కుమార్, బంగురు శాంతి, శేఖర్, పంచాడి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

కాశీబుగ్గ దేవాలయ ఘటన బాధాకరం : అరకు ఎమ్మెల్యే రేగం
అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసిలాట ఘటనలో భక్తులు దుర్మరణం చెందడం పట్ల వారికి సానుభూతి వ్యక్తం చేస్తూ,వారి ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారి ఆధ్వర్యంలో అరకులోయ ప్రధాన కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మరియు ఈ ఘటన లో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరకులోయ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, మాజీ విశాఖపట్నం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, వైసీపీ అరకులోయ మండల పార్టీ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, వైసీపీ అరకు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు నరసింగ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, బస్కి గ్రామపంచాయతీ సర్పంచ్ రమేష్, మడగడ గ్రామ పంచాయతీ సూపర్ సర్పంచ్ బాలరాజు, సుంకర మెట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కొర్ర అర్జున్ రావు, వైసిపి నేతలు గుంజేడి ప్రసాద్, కామేష్, లబుడు బారికి కిరణ్ కుమార్, బంగురు శాంతి, శేఖర్, పంచాడి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

