నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి )
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాదు నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఇతర అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పురోగతిపై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.
👉 కేటగిరి ఎ – 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు,
👉 కేటగిరి బి లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటర్ జాబితాలో లేకుండా, 2025 జాబితాలో నమోదు కాబడిన వారు,
👉 కేటగిరి సి లో 1987 నుండి 2002 మధ్యలో జన్మించిన వారు, 2025 ఓటర్ జాబితాలో నమోదు కాబడిన వారు,
👉 కేటగిరీ డి లో 2002 నుండి 2007 మధ్యలో జన్మించిన వారి గా విభజించడం జరిగిందని తెలిపారు.
ఓటర్ లిస్ట్ ల జాబితా కు సంబంధించిన 6, 7, 8 ఫారంలను త్వరగా ఎంక్వయిరీ చేసి ఏడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన :ప్రధాన ఎన్నికల అధికారి
నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాదు నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఇతర అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పురోగతిపై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. 👉 కేటగిరి ఎ – 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, 👉 కేటగిరి బి లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటర్ జాబితాలో లేకుండా, 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, 👉 కేటగిరి సి లో 1987 నుండి 2002 మధ్యలో జన్మించిన వారు, 2025 ఓటర్ జాబితాలో నమోదు కాబడిన వారు, 👉 కేటగిరీ డి లో 2002 నుండి 2007 మధ్యలో జన్మించిన వారి గా విభజించడం జరిగిందని తెలిపారు. ఓటర్ లిస్ట్ ల జాబితా కు సంబంధించిన 6, 7, 8 ఫారంలను త్వరగా ఎంక్వయిరీ చేసి ఏడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

