కామారెడ్డి, 30 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) :
జిల్లా సహకార సంఘాల పాలకవర్గ సభ్యుల కోసం తెలంగాణ సహకార యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్యాంక్ మీటింగ్ హాల్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. వివిధ సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, రైతు సమితుల ప్రతినిధులు, శాఖాధికారులు పాల్గొన్నారు.ఈ సదస్సులో యాప్ 21, స్మార్ట్ 10000 యాప్స్, స్కిల్ ఇండియా కార్యక్రమాలు పరిచయం చేయడంతో పాటు సంఘాల నిర్వహ ణ, ఆర్థిక సముపార్జన, వనరుల వినియోగం, ప్రభు త్వ మద్దతు ఫండ్ల వినియోగ పద్ధతులపై చర్చించా రు. సహకార వ్యవస్థ బలోపేతానికి సమన్వయం, పారదర్శకత అవసరమని వక్తలు సూచించారు. అసిస్టెంట్ ప్రిన్సిపల్ భూక వెంకన్న, చీఫ్ సింటెక్ ఆఫీసర్ డాక్టర్ భూసార్మ శ్రీనివాస్, ఉమర్ రహమత్ ప్రసంగించారు. పిఎసిఎస్ అధ్యక్షులు సదాశివరెడ్డి, దేహించల్‌రెడ్డి, సీహర్, శివరాములు, లింగంపేట, గాంధారి, భీష్కుల్, కిళ్ళ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ రిజిస్టార్లు కె. లక్ష్మీకళ, జె. శ్రీనివాస్, బాంత పాషా, సీనియర్ ఇన్స్పెక్టర్లు సుశీల, సురేష్ తదితరులు హాజరయ్యారు.


