Monday, 30 March 2026
  • Home  
  • విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు విశాఖ విచ్చేసిన బస్సు యాత్ర విజయవంతం
- విశాఖపట్నం

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు విశాఖ విచ్చేసిన బస్సు యాత్ర విజయవంతం

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విశాఖపట్నం జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ.* *రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. *ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలి.* *ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించాలి.* పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయ్యాలి. పున్నమి ప్రతినిధి, అక్టోబర్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రవ్యాప్త బస్సు జాతా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న సందర్భంగా మూడవ రోజు విశాఖపట్నం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లం.నాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, నాసర్ జీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కుల్లాయిస్వామి, మస్తాన్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పిపిపి పేరుతో ప్రైవేట్ , కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107, 108 జీవోలు తీసుకువస్తే నానా గగ్గోలు పెట్టి యువగలం పాదయాత్రలో ఆ జీవోలను రద్దు చేస్తాం. పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ నేడు వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు కరణ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకి 50 లక్షలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ 6400 కోట్లు రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలు గతంలో 4,500 పాఠశాలలు మూతపడ్డాయని వాటిని వెంటనే పునః ప్రారంభించాలన్నారు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీనీ అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి.ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ , కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి ఒక్క జూనియర్ కళాశాలను నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల బస్సుజాత ముగిసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల లోకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ బహిరంగ సభలో ఏఐడీఎస్ఓ జిల్లా అధ్యక్షులు అభిలాష్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, బందెల నాసర్ జీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, కొళ్లాయ్యి స్వామి జిల్లా అధ్యక్షులు శేఖర్, మౌనిక కిరణ్, అభిషేక్, గ్రేష్ ప్రకాష్, గణేష్, శివ, గోపి,కంజీరా, పవన్ కళ్యాణ్, ఆదర్శ్, నాయకులు సందీప్, రమణ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు విచ్చేసిన జాతీయ రాష్ట్ర నాయకత్వానికి విశాఖ జిల్లా ఏఐవైఎఫ్ వై రాంబాబు, కే అచ్యుతరావు ఘనంగా పూలమాలలతో స్వాగతం పలికారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విశాఖపట్నం జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ.*
*రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.*

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి.
*ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలి.*

*ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించాలి.*
పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయ్యాలి.

పున్నమి ప్రతినిధి, అక్టోబర్

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రవ్యాప్త బస్సు జాతా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న సందర్భంగా మూడవ రోజు విశాఖపట్నం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లం.నాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, నాసర్ జీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కుల్లాయిస్వామి, మస్తాన్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పిపిపి పేరుతో ప్రైవేట్ , కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107, 108 జీవోలు తీసుకువస్తే నానా గగ్గోలు పెట్టి యువగలం పాదయాత్రలో ఆ జీవోలను రద్దు చేస్తాం. పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ నేడు వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు కరణ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకి 50 లక్షలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ 6400 కోట్లు రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలు గతంలో 4,500 పాఠశాలలు మూతపడ్డాయని వాటిని వెంటనే పునః ప్రారంభించాలన్నారు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీనీ అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి.ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ , కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి ఒక్క జూనియర్ కళాశాలను నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల బస్సుజాత ముగిసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల లోకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ బహిరంగ సభలో ఏఐడీఎస్ఓ జిల్లా అధ్యక్షులు అభిలాష్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, బందెల నాసర్ జీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, కొళ్లాయ్యి స్వామి జిల్లా అధ్యక్షులు శేఖర్, మౌనిక కిరణ్, అభిషేక్, గ్రేష్ ప్రకాష్, గణేష్, శివ, గోపి,కంజీరా, పవన్ కళ్యాణ్, ఆదర్శ్, నాయకులు సందీప్, రమణ పాల్గొన్నారు.
ఈ బహిరంగ సభకు విచ్చేసిన జాతీయ రాష్ట్ర నాయకత్వానికి విశాఖ జిల్లా ఏఐవైఎఫ్ వై రాంబాబు, కే అచ్యుతరావు ఘనంగా పూలమాలలతో స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.