Sunday, 17 May 2026
  • Home  
  • టెట్ పరీక్ష పై ప్రభుత్వం పునః సమీక్షించాలి*
- ఆంధ్రప్రదేశ్

టెట్ పరీక్ష పై ప్రభుత్వం పునః సమీక్షించాలి*

*టెట్ పరీక్ష పై ప్రభుత్వం పునః సమీక్షించాలి* *కొండూరు శ్రీనివాస్ రాజు నోబుల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు* రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ద్వారా ఎన్నికయి దాదాపు 25 సంవత్సరాల పైబడి సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం చాలా ఇబ్బందిగాను కష్టంగానూ ఉంటుందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాయచోటి నందు శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సుప్రీంకోర్టులో టెట్ పరీక్ష పై రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మన వాదనలు వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు విద్యాశాఖ మoత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఉపాధ్యాయులలో ఉన్న గందరగోళ పరిస్థితికి ముగింపు పలకాలన్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో సెప్టెంబర్ ఒకటో తేదీన జారి చేసిన టెట్ పరీక్షల తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి వాదించి తదుపరి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇలాంటి వ్యవహారం నుండి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని నోబెల్ టీచర్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. 50 సంవత్సరాల వయస్సు పైబడిన ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఎంతో ఆందోళనలకు గురవుతున్న విషయాన్ని గుర్తించి ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించాలన్నారు .2003 డీఎస్సీ ద్వారా నియామకాలు పొందిన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతి త్వరలో పాత పెన్షన్స్ అమలుకు నిర్ణయం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రూటా రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ హాషిం, పాలెం రాజా,వెంకటరమణ శ్రీనివాసులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

*టెట్ పరీక్ష పై ప్రభుత్వం పునః సమీక్షించాలి*

*కొండూరు శ్రీనివాస్ రాజు నోబుల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు*

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ద్వారా ఎన్నికయి దాదాపు 25 సంవత్సరాల పైబడి సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం చాలా ఇబ్బందిగాను కష్టంగానూ ఉంటుందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాయచోటి నందు శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సుప్రీంకోర్టులో టెట్ పరీక్ష పై రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మన వాదనలు వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు విద్యాశాఖ మoత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఉపాధ్యాయులలో ఉన్న గందరగోళ పరిస్థితికి ముగింపు పలకాలన్నారు.
దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో సెప్టెంబర్ ఒకటో తేదీన జారి చేసిన టెట్ పరీక్షల తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి వాదించి తదుపరి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇలాంటి వ్యవహారం నుండి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని నోబెల్ టీచర్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. 50 సంవత్సరాల వయస్సు పైబడిన ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఎంతో ఆందోళనలకు గురవుతున్న విషయాన్ని గుర్తించి ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించాలన్నారు .2003 డీఎస్సీ ద్వారా నియామకాలు పొందిన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతి త్వరలో పాత పెన్షన్స్ అమలుకు నిర్ణయం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రూటా రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ హాషిం, పాలెం రాజా,వెంకటరమణ శ్రీనివాసులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.