Thursday, 12 February 2026
  • Home  
  • జిమ్నస్టిక్ ఇండోర్ స్టేడియం లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లను సందర్శించిన కలెక్టర్ హరింద్ర ప్రసాద్
- ఆంధ్రప్రదేశ్

జిమ్నస్టిక్ ఇండోర్ స్టేడియం లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లను సందర్శించిన కలెక్టర్ హరింద్ర ప్రసాద్

*జిమ్మాస్టిక్ ఇండోర్ స్టేడియంలో ఎగ్జిబిష‌న్ క‌మ్ సేల్* *స్టాళ్ల‌ను సంద‌ర్శించి సంతృప్తి వ్య‌క్తం చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ విశాఖ‌ప‌ట్టణం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: సూప‌ర్ జీఎస్టీ.. సూప‌ర్ సేవింగ్స్ లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ‌, సెట్విస్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం పాండురంగాపురంలోని జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియంలో ఎగ్జిబిష‌న్ క‌మ్ సేల్ ఏర్పాటు చేశారు. ఇక్క‌డ క్రీడా ప‌రిక‌రాల‌ను, హ‌స్త క‌ళ‌ల‌కు సంబంధించి వ‌స్తువుల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచారు. క్రీడాకారులు, సాధార‌ణ పౌరులు వాటిన కొనేందుకు, వీక్షించేందుకు ఆస‌క్తి క‌న‌బరిచారు. ఈ క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ సంబంధిత ఎగ్జిబిష‌న్ ను సంద‌ర్శించారు. అక్క‌డ అందుబాటులో ఉంచిన క్రీడా ప‌రిక‌రాల‌ను, హ‌స్త క‌ళ‌ల‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణపై సంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న నిర్వాహ‌కుల‌ను అభివ‌నందించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క్రీడా అధికారి వెంక‌టేశ్వ‌ర‌రావు, సెట్విస్ సీఈవో క‌విత‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

*జిమ్మాస్టిక్ ఇండోర్ స్టేడియంలో ఎగ్జిబిష‌న్ క‌మ్ సేల్*

*స్టాళ్ల‌ను సంద‌ర్శించి సంతృప్తి వ్య‌క్తం చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్

విశాఖ‌ప‌ట్టణం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: సూప‌ర్ జీఎస్టీ.. సూప‌ర్ సేవింగ్స్ లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ‌, సెట్విస్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం పాండురంగాపురంలోని జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియంలో ఎగ్జిబిష‌న్ క‌మ్ సేల్ ఏర్పాటు చేశారు. ఇక్క‌డ క్రీడా ప‌రిక‌రాల‌ను, హ‌స్త క‌ళ‌ల‌కు సంబంధించి వ‌స్తువుల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచారు. క్రీడాకారులు, సాధార‌ణ పౌరులు వాటిన కొనేందుకు, వీక్షించేందుకు ఆస‌క్తి క‌న‌బరిచారు. ఈ క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ సంబంధిత ఎగ్జిబిష‌న్ ను సంద‌ర్శించారు. అక్క‌డ అందుబాటులో ఉంచిన క్రీడా ప‌రిక‌రాల‌ను, హ‌స్త క‌ళ‌ల‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణపై సంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న నిర్వాహ‌కుల‌ను అభివ‌నందించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క్రీడా అధికారి వెంక‌టేశ్వ‌ర‌రావు, సెట్విస్ సీఈవో క‌విత‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.