Saturday, 28 March 2026
  • Home  
  • ఆదూరుపల్లి గురుకులంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆదూరుపల్లి గురుకులంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, అది జీవిత నాణ్యత మరియు నిద్ర పై చూపే ప్రభావం గురించి ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మజ , కెరీర్ గైడెన్స్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సిలర్ బి. మల్లికార్జున వివరించారు.ప్రతిరోజు యోగా,వ్యాయామం,మంచి ఆహారం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు.భావోద్వేగ సహాయం కోసం కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులతో భావాలను పంచుకోవడం అవసరమని సూచించారు.మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించారు.అలాగే ప్రపంచ ఆడపిల్లల దినోత్సవం సందర్భంగా బాలికల సాధికారత,సమానత్వం పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ప్రిన్సిపాల్ పద్మజ,మల్లికార్జున బాలికల హక్కులు,వారి భవిష్యత్తు అభివృద్ధి,సమాజంలో వారి పాత్రపై ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)

చేజర్ల మండలం ఆదురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, అది జీవిత నాణ్యత మరియు నిద్ర పై చూపే ప్రభావం గురించి ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మజ , కెరీర్ గైడెన్స్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సిలర్ బి. మల్లికార్జున వివరించారు.ప్రతిరోజు యోగా,వ్యాయామం,మంచి ఆహారం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు.భావోద్వేగ సహాయం కోసం కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులతో భావాలను పంచుకోవడం అవసరమని సూచించారు.మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించారు.అలాగే ప్రపంచ ఆడపిల్లల దినోత్సవం సందర్భంగా బాలికల సాధికారత,సమానత్వం పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ప్రిన్సిపాల్ పద్మజ,మల్లికార్జున బాలికల హక్కులు,వారి భవిష్యత్తు అభివృద్ధి,సమాజంలో వారి పాత్రపై ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.