Tuesday, 24 March 2026
  • Home  
  • సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్లు అందజేసిన జ్యోతుల నవీన్.
- కాకినాడ

సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్లు అందజేసిన జ్యోతుల నవీన్.

గండేపల్లి మండలం జెడ్ రాగంపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్లు జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉండే పేషెంట్లకు అందించే భోజనాన్ని పరిశీలించి పేషంట్ల సహాయకులను ఆహార పదార్ధాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్న నవీన్. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మన ప్రాంతంలో సామాజిక అవసరాలను గుర్తించి వాటిని అందించేకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్లు అందించడం జరిగిందని అదేవిధంగా తొందరలోనే ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకుల కు ఉచిత భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, ఆసుపత్రి వైద్యులు ప్రణీత్, పీలా మహేష్, బో దిరెడ్ల సుబ్బారావు, రాయి సాయి, తదితరులు పాల్గొన్నారు.

గండేపల్లి మండలం జెడ్ రాగంపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్లు జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం ఆసుపత్రిలో ఉండే పేషెంట్లకు అందించే భోజనాన్ని పరిశీలించి పేషంట్ల సహాయకులను ఆహార పదార్ధాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్న నవీన్. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మన ప్రాంతంలో సామాజిక అవసరాలను గుర్తించి వాటిని అందించేకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్లు అందించడం జరిగిందని అదేవిధంగా తొందరలోనే ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకుల కు ఉచిత భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, ఆసుపత్రి వైద్యులు ప్రణీత్, పీలా మహేష్, బో దిరెడ్ల సుబ్బారావు, రాయి సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.