*పున్నమి ప్రతినిధి కామారెడ్డి సెప్టెంబర్ 14*
*ఘనంగా ప్రాంత స్థాయి గణిత, సంస్కృతి విజ్ఞానమేళ సమారోప్,*
స్థానిక శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్ కామారెడ్డి లో గణితం & సైన్స్ విభాగాలలో 450 ప్రదర్శనలు ప్రదర్శించడం జరిగింది. కామారెడ్డి పట్టణంలోని 8 ప్రైవేటు పాఠశాల విద్యార్థులంతా వచ్చి తిలకించారు. మూడు రోజుల పాటు భోజన స్నాక్స్ అల్పాహారం అందరికీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా సైన్స్ ఫెయిర్ మూడు రోజులు రోజుల్లో(12,13,14 తేదీలలో) భాగంగా ఈరోజు అనగా 14 /09 /2025 ఆదివారం రోజున సమారోప్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు ( కామారెడ్డి శాసనసభ సభ్యులు) విచ్చేసి మాట్లాడుతూ చదువు ఒకటే ముఖ్యం కాదని చదువుతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలని తెలిపారు. మన సంస్కృతికి సాంప్రదాయాలకు మంచి క్రమశిక్షణకు శిశు మందిరాలు పెట్టిన పెరు అని తెలిపారు ఆ దేశానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు నలుగురికి సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని తెలిపారు స్వార్థం విడవాలని తెలిపారు పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు .అతిథిగా శ్రీ మదన్ మోహన్ గారు (ఎల్లారెడ్డి శాసనసభ సభ్యులు) విచ్చేసి మాట్లాడుతూ చదువు అన్నింటికంటే ముఖ్యమని తెలిపారు చదువు తోనే ఏదైనా సాధించగలమని నేను కూడా అలాగే చదివానని తెలిపారు మారుతున్న కాలానుగుణంగా మనం కూడా టెక్నాలజీని మంచి కోసం
ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేరాదని తెలిపారు వక్త శ్రీ అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి (సంచలన సమితి సహకార దర్శి) గారు, మాట్లాడుతూ లిపిలేని సమయంలో మన దేశం ఋగ్వేదము వ్రాయబడిందని అని తెలిపారు. సున్నా ను కనుగొన్నది భారతీయులను తెలిపారు.
విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల ప్రదర్శనలు మరియు నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి ప్రాంత స్థాయిలో ఎంపికైన ప్రదర్శనలకు, క్షేత్రస్థాయిలో పోటీ ఉంటుందని తెలిపారు
ఉత్తమ ప్రదర్శన కనబడచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్రీ శ్యామ్ సుందర్ గారు, శ్రీ గంగారెడ్డి గారు (పాఠశాల ఉపాధ్యక్షులు) శ్రీ నల్లన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు (ప్రాంత శైక్షనిక్ ప్రముఖ్) రెడ్డి గారి హరిస్మరన్ రెడ్డి గారు (తెలంగాణ పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు) శ్రీ బోర్డు శంకర్ గారు గారు, శ్రీ గిరెడ్డి రాజిరెడ్డి గారు,( జిల్లా కార్యదర్శి) , శ్రీ రణజిత్ మోహన్ గారు, శ్రీ భాస్కర రావు గారు, శ్రీ మల్లేష్ యాదవ్ గారు, శ్రీ అనిల్ రెడ్డి గారు, శ్రీ రాజేందర్ గౌడ్ గారు, శ్రీ రఘు కుమార్ గారు, శ్రీ ప్రతాప్ గౌడ్ గారు, శ్రీ పక్కి శ్రీనివాస్ గారు,. (విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్) పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ నల్ల నాగభూషణం గారు అకాడమిక్ ప్రిన్సిపల్ శ్రీ నాగేష్ గారు, వివిద విభాగాల శైక్షనిక్ ప్రముఖ్ లు,ఆచార్యులు మాతాజీలు పాల్గొన్నారు


