Wednesday, 11 February 2026
  • Home  
  • మన తరాల తర్వాత! తరువాతి తరాల పరిస్థితి ఏమిటి.?
- సక్సెస్ స్టోరీస్

మన తరాల తర్వాత! తరువాతి తరాల పరిస్థితి ఏమిటి.?

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ తరాల గాయం (Generational Trauma) అర్థం: ఒక తరం యొక్క అపరిష్కృత గాయం (యుద్ధం, దారిద్ర్యం, అణచివేత వంటివి) తరువాతి తరానికి సంక్రమించి, వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పదవి మత్తులో ప్రజాస్వామ్యం! ప్రచారం మత్తులో రాజకీయం! ఉచితాల మత్తులో జనం! మాదకద్రవ్యాల మత్తులో యువజనం! లంచాల మత్తులో ఉద్యోగం! ర్యాంకుల మత్తులో విద్యావిధానం! విత్తం మత్తులో వైద్యం! *లాభాల మత్తులో వ్యాపారం! పురస్కారాల మత్తులో పాండిత్యం! గ్రాఫిక్స్ మత్తులో సినీరంగం! మొబైల్ గేమ్ ల మత్తులో బాల్యం! పబ్ మత్తులో యువతరం! అంతర్జాలం మత్తులో అందరం! సంపాదన మత్తులో స్వార్ధజనం! అట్టహాసం మత్తులో వివాహం! మోసాల మత్తులో వాణిజ్యం! వాయిదాల మత్తులో వ్యాజ్యం! మామూళ్లు మత్తులో రౌడీయిజం! మతం మత్తులో మానవత్వం! లైకుల మత్తులో సాంఘిక మాధ్యమం! టి ఆర్ పి మత్తులో మీడియా! సర్క్యులేషన్ మత్తులో పత్రికలు! నోటు మత్తులో ఓటు హక్కు! మత్తులో జోగుతున్న జగతి ! మనిషికెక్కడిది జాగృతి ! మనుగడకెక్కడిది ప్రగతి ! మందగిస్తున్న పురోగతి! ఇది నేటి దుస్థితి! మొత్తం ప్రపంచాన్ని! మత్తు ఆవరించింది! నేడు అవినీతి మత్తులో! కుల మతాల మత్తులో! మొత్తం దేశం అంతా! ఊగుతున్నది, ఇది రేపటి తరాల దురదృష్టం! మనతరం ఎలాగోలా లాగిస్తాం కాని, మన తరువాతి! తరాల పరిస్థితి ఏమిటి అంటే శూన్యం…..? తరువాతి తరాలు ఆందోళన, మాంద్యం లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడవచ్చు. తరాల గాయాన్ని అర్థం చేసుకుని, దాన్ని అధిగమించే వ్యూహాలను నేర్చుకోవడం, మరియు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేయడం వంటివి తరువాతి తరాల పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కాబట్టి, మన తరువాత వచ్చే తరాల పరిస్థితి, గత తరాల నుండి మనం ఏమి వదిలి వెళతాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది – అది గాయమా లేక సంపదా.

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
తరాల గాయం (Generational Trauma) అర్థం:
ఒక తరం యొక్క అపరిష్కృత గాయం (యుద్ధం, దారిద్ర్యం, అణచివేత వంటివి) తరువాతి తరానికి సంక్రమించి, వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
పదవి మత్తులో ప్రజాస్వామ్యం!
ప్రచారం మత్తులో రాజకీయం!
ఉచితాల మత్తులో జనం!
మాదకద్రవ్యాల మత్తులో యువజనం!
లంచాల మత్తులో ఉద్యోగం!
ర్యాంకుల మత్తులో విద్యావిధానం!
విత్తం మత్తులో వైద్యం!
*లాభాల మత్తులో వ్యాపారం!
పురస్కారాల మత్తులో పాండిత్యం!
గ్రాఫిక్స్ మత్తులో సినీరంగం!
మొబైల్ గేమ్ ల మత్తులో బాల్యం!
పబ్ మత్తులో యువతరం!
అంతర్జాలం మత్తులో అందరం!
సంపాదన మత్తులో స్వార్ధజనం!
అట్టహాసం మత్తులో వివాహం!
మోసాల మత్తులో వాణిజ్యం!
వాయిదాల మత్తులో వ్యాజ్యం!
మామూళ్లు మత్తులో రౌడీయిజం!
మతం మత్తులో మానవత్వం!
లైకుల మత్తులో సాంఘిక మాధ్యమం!
టి ఆర్ పి మత్తులో మీడియా!
సర్క్యులేషన్ మత్తులో పత్రికలు!
నోటు మత్తులో ఓటు హక్కు!
మత్తులో జోగుతున్న జగతి !
మనిషికెక్కడిది జాగృతి !
మనుగడకెక్కడిది ప్రగతి !
మందగిస్తున్న పురోగతి!
ఇది నేటి దుస్థితి!
మొత్తం ప్రపంచాన్ని!
మత్తు ఆవరించింది!
నేడు అవినీతి మత్తులో!
కుల మతాల మత్తులో!
మొత్తం దేశం అంతా!
ఊగుతున్నది, ఇది రేపటి తరాల దురదృష్టం!
మనతరం ఎలాగోలా లాగిస్తాం కాని, మన తరువాతి! తరాల పరిస్థితి ఏమిటి అంటే శూన్యం…..?

తరువాతి తరాలు ఆందోళన, మాంద్యం లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడవచ్చు.
తరాల గాయాన్ని అర్థం చేసుకుని, దాన్ని అధిగమించే వ్యూహాలను నేర్చుకోవడం, మరియు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేయడం వంటివి తరువాతి తరాల పరిస్థితిని మెరుగుపరుస్తాయి.
కాబట్టి, మన తరువాత వచ్చే తరాల పరిస్థితి, గత తరాల నుండి మనం ఏమి వదిలి వెళతాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది – అది గాయమా లేక సంపదా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.