సకాలంలో మున్సిపల్ దుకాణల అద్దె బకాయిలు చెల్లించాలి
-మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ
ఆగష్టు 6పున్నమి ప్రతినిధి దొరవారి సత్రం
నాయుడుపేట పట్టణంలోని మున్సిపల్ దుకాణల అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని మున్సిపల్ మేనేజర్ ఎం. ఉరుకుందమ్మ కోరారు. బుధవారం కమీషనర్ ఫజులుల్లా ఆదేశాల మేరకు పట్టణంలోని బకాయి ఉన్న మున్సిపల్ దుకాణాలను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె దుకాణ లీజుదారులతో బకాయిల చెల్లింపుపై చర్చించారు. ఒక నెల బకాయి ఉంటే తాము ఒత్తిడి తీసుకురామని,నెలల పాటు అద్దె పెండింగ్ ఉంటే ఏలా అని ప్రశ్నించారు.వారం లోపు బకాయి ఉన్న అద్దెలు చెల్లించాలని, లేనిపక్షంలో దుకాణలకు తాళాలు వేస్తామని ఆమె హెచ్చరించారు. మేనేజర్ వెంట బిల్ కలెక్టర్లు గాయిత్రి, ప్రసాద్,శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

అద్దె బకాయిలను సకాలంలో చెల్లించండి
సకాలంలో మున్సిపల్ దుకాణల అద్దె బకాయిలు చెల్లించాలి -మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ ఆగష్టు 6పున్నమి ప్రతినిధి దొరవారి సత్రం నాయుడుపేట పట్టణంలోని మున్సిపల్ దుకాణల అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని మున్సిపల్ మేనేజర్ ఎం. ఉరుకుందమ్మ కోరారు. బుధవారం కమీషనర్ ఫజులుల్లా ఆదేశాల మేరకు పట్టణంలోని బకాయి ఉన్న మున్సిపల్ దుకాణాలను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె దుకాణ లీజుదారులతో బకాయిల చెల్లింపుపై చర్చించారు. ఒక నెల బకాయి ఉంటే తాము ఒత్తిడి తీసుకురామని,నెలల పాటు అద్దె పెండింగ్ ఉంటే ఏలా అని ప్రశ్నించారు.వారం లోపు బకాయి ఉన్న అద్దెలు చెల్లించాలని, లేనిపక్షంలో దుకాణలకు తాళాలు వేస్తామని ఆమె హెచ్చరించారు. మేనేజర్ వెంట బిల్ కలెక్టర్లు గాయిత్రి, ప్రసాద్,శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

