పల్నాడు :*నరసరావుపేట పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక* *ఈ నెల 22వ తేదీ నుంచి రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటి సరఫరా* పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ నుంచి నరసరావుపేట పట్టణంలో రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటిని సరఫరా చేయనున్నట్లు నరసరావుపేట పురపాలక సంఘం ప్రకటించింది. కావున పట్టణ ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అనవసరంగా నీటిని వృథా చేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. Advertisement · Punnami PunnamiLearn more → కమిషనర్, నరసరావుపేట పురపాలక సంఘం