ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తెలిపారు. జిల్లాలోని మొత్తం 1,460 పోలింగ్ కేంద్రాల్లో 677 కేంద్రాల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. మరో 544 పోలింగ్ కేంద్రాల్లో 95 శాతం, 158 కేంద్రాల్లో 90 శాతం మేర ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలిన కేంద్రాల్లో కూడా త్వరితగతిన డిజిటలైజేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) పరస్పర సహకారంతో ఓటర్లు సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
677 పోలింగ్ కేంద్రాల్లో డిజిటలైజేషన్ పూర్తి: కలెక్టర్ దివాకర్ టి.ఎస్.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తెలిపారు. జిల్లాలోని మొత్తం 1,460 పోలింగ్ కేంద్రాల్లో 677 కేంద్రాల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. మరో 544 పోలింగ్ కేంద్రాల్లో 95 శాతం, 158 కేంద్రాల్లో 90 శాతం మేర ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలిన కేంద్రాల్లో కూడా త్వరితగతిన డిజిటలైజేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) పరస్పర సహకారంతో ఓటర్లు సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

