రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా ప్రతి వారం నిర్వహిస్తున్న జాబ్ మేళాలు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రామచంద్రపురం ఉపాధి భవన్‌లో గురువారం నిర్వహించిన 48 వ జాబ్ మేళాలో మొత్తం 23 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం ఫాక్స్ కాన్ కు కంపెనీకి 10 మంది, కియా 4, ఓరియంట్ 5, పెట్టి ఇంజనీరింగ్ 2, హీరో కంపెనీకి 3 ఎంపికయ్యారు. కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధి స్నేహ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించబడింది. ఎంపికైన అభ్యర్థులకు హెచ్ ఆర్ స్నేహ నియామక పత్రాలు అందజేసి అభినందించారు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమకు ఈ అవకాశం కల్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం, ఉపాధి అధినేత రామ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు.


