Wednesday, 2 September 2026
  • Home  
  • 420 హామీల బ్యానర్‌తో నిర్మల్‌లో బీఆర్‌ఎస్ భారీ ఆందోళన
- నిర్మల్

420 హామీల బ్యానర్‌తో నిర్మల్‌లో బీఆర్‌ఎస్ భారీ ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్మల్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 420 హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ బ్యానర్‌తో వినూత్నంగా ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు రాము, అయ్యన్నగారి రాజేందర్, మహమ్మద్ నజీరుద్దీన్ తదితరుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడ నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్. సీఎం మహబూబ్. మహమ్మద్ అజీజ్. మినాజ్ ఇంతియాజ్. మసుద్ ఖాన్ ఆయుఖాన్ నయూమ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్మల్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 420 హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ బ్యానర్‌తో వినూత్నంగా ఆందోళన చేపట్టారు.
బీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు రాము, అయ్యన్నగారి రాజేందర్, మహమ్మద్ నజీరుద్దీన్ తదితరుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ర్యాలీగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడ నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్. సీఎం మహబూబ్. మహమ్మద్ అజీజ్. మినాజ్ ఇంతియాజ్. మసుద్ ఖాన్ ఆయుఖాన్ నయూమ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.