వార్త ముఖ్యాంశాలు
- బొంతు రామకృష్ణకి.యన్నపు లలిత 10.వేలు ఆర్దికసహయం పి.
- గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి.ఆగష్టు 22..డా.బిఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బొంతు రామకృష్ణ రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సుమారు రూ.14 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.బొంతు…
బొంతు రామకృష్ణకి.యన్నపు లలిత 10.వేలు ఆర్దికసహయం

పి. గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి.ఆగష్టు 22..డా.బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బొంతు రామకృష్ణ రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సుమారు రూ.14 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.బొంతు రామకృష్ణ తల్లిదండ్రులు తమ కుమారుడికి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, శస్త్రచికిత్సకు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చుకోలేని పరిస్థితిలో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రామకృష్ణకు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన లలితమ్మ సేవా సంస్థ అధ్యక్షురాలు యన్నపు లలిత శనివారం మొసలపల్లి గ్రామంలోని రామకృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శింశించి 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని యన్నపు లలిత భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దంతులూరి శ్రీనివాసరాజు,మాజీ ఉపసర్పంచ్ కట్ట గోపాలకృష్ణ గోకలే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ముత్తాబత్తుల మణిరత్నం,ఎంపీటీసీ సభ్యుడు నూకపెయి సత్యనారాయణ, వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు పి. సతీష్ కుమార్,మాజీ సర్పంచ్ గుమ్మడి ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు