సీతారామపురం మండల ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతమ్మ పదవీకాలం నేటితో ముగిసింది. 2006లో బశినేనిపల్లి ఏకగ్రీవ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె, 2012లో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, 2014లో ఎంపీటీసీగా, 2021లో సీతారామపురం ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్లుగా ఎన్నికల్లో ఓటమి ఎరుగకుండా ప్రత్యేక గుర్తింపు పొందారు. మహిళల సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగారు. 2021 ఎన్నికల్లో మండలంలోని ఏడు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఐదు స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించారు. మండలంలోని 14 పంచాయతీల పరిధిలో 41 గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భర్త చింతంరెడ్డి సుబ్బారెడ్డి ప్రోత్సాహంతో ప్రజలకు సేవలందించారు.

20 ఏళ్లుగా ఓటమి ఎరుగని మహిళగా గుర్తింపు.. ఎంపీపీ పద్మావతమ్మ పదవీకాలం ముగింపు