వార్త ముఖ్యాంశాలు
- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా ఈ నెల 19న నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజా బాలాజీ రావు తెలిపారు.
- ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (సాప్) ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంపికలకు 13 ఏళ్లు పైబడిన ప్రత్యేక అవసరాలున్న బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు.
- పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా తైక్వాండో, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని వివరించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా ఈ నెల 19న నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజా బాలాజీ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (సాప్) ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంపికలకు 13 ఏళ్లు పైబడిన ప్రత్యేక అవసరాలున్న బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్, పారా తైక్వాండో, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని వివరించారు. ప్రతి మండలం నుంచి అర్హులైన విద్యార్థులను గుర్తించి, ఆరు విభాగాల్లోనూ ప్రతిభావంతులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. వివరాలకు స్టేడియంలోని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని సంప్రదించాలని కోరారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్