వార్త ముఖ్యాంశాలు
- పేద ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాహిత పాలనకు మరో నిదర్శనంగా, సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి చేతుల మీదుగా బి.ఎన్.
- కండ్రిగ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ₹3,35,889/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది.
- ఈ సందర్భంగా శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “పేదల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందుంటారు.
పేద ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాహిత పాలనకు మరో నిదర్శనంగా, సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి చేతుల మీదుగా బి.ఎన్. కండ్రిగ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ₹3,35,889/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “పేదల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముందుంటారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటివరకు ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాం. భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుంది” అని తెలిపారు.
అలాగే ప్రజల కష్టకాలంలో ప్రభుత్వ సహాయం ఒక భరోసాగా నిలుస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలు చివరి అర్హుడి వరకు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వై. చెంచు రామానాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ ముని చంద్ర నాయుడు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ యాదవ్, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“ఆపదలో భరోసా… పేదల పక్షాన పరిపాలన… ఇదే కూటమి ప్రభుత్వ నిబద్ధత!