రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించండి*
*జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి*
విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబరు 29. పున్నమి ప్రతినిధి
రైతులు మ్యూటేషన్ల కోసం పెట్టుకున్న ధరఖాస్తులు గానీ, ఇతర రెవెన్యూపరమైన సమస్యలపైన గానీ వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఛీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, సిసిఎల్ఏ జయలక్ష్మి మంగళవారం అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ ఒన్, రీ సర్వే, 22ఏ జాబితా, పీజేఆర్ఎస్ తదితరత అంశాలపై సమీక్షించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మ్యూటేషన్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసి, 1 బి కూడా రైతులకు వెంటనే జారీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే 22ఏ జాబితా కారణంగా సామాన్య రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. జాయింట్ ఎల్‌పిఎంలను వీలైనంత వేగంగా విడదీయాలని, జులై చివరినాటికి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వే వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ఆర్‌డిఓ సుధాసాగర్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


