Wednesday, 23 September 2026
  • Home  
  • పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ దయాకర్‌రెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి కార్లపై రాళ్ల దాడి.
- ఖమ్మం

పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ దయాకర్‌రెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి కార్లపై రాళ్ల దాడి.

సుద్దవాగు తండాలో కార్లపై రాళ్ల దాడి అన్నదాన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్సై జగదీష్‌ తిరుమలాయపాలెం, పున్నమి న్యూస్.. తిరుమలాయపాలెం మండలంలోని సుద్దవాగు తండాలో అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి అన్నదాన కార్యక్రమానికి హాజరైన సమయంలో వారి కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండాలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసి, అనంతరం కార్లపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటుండగా, దీనికి సంబంధించి ఎలాంటి ఎల్‌సీ ఇవ్వలేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎలా ఆపివేయబడింది, కార్లపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.

సుద్దవాగు తండాలో కార్లపై రాళ్ల దాడి

అన్నదాన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత

ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్సై జగదీష్‌

తిరుమలాయపాలెం, పున్నమి న్యూస్..

తిరుమలాయపాలెం మండలంలోని సుద్దవాగు తండాలో అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి అన్నదాన కార్యక్రమానికి హాజరైన సమయంలో వారి కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండాలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసి, అనంతరం కార్లపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్న ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపివేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటుండగా, దీనికి సంబంధించి ఎలాంటి ఎల్‌సీ ఇవ్వలేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎలా ఆపివేయబడింది, కార్లపై రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.