దొరవారిసత్రం మండలం :హైవేపై భారీ చెట్టు ఒక్కసారిగా నేలకొరిగి రహదారికి అడ్డంగా పడింది. దీంతో హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై చెట్టు కొమ్మలు, ఆకులు విస్తరించి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో చెట్టు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెట్టు రహదారికి అడ్డంగా పడటంతో వాహనాలు నెమ్మదిగా, అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైవేపై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై పడిన చెట్టును, కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. చెట్టును తొలగించి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Uploaded Video:


