Tuesday, 29 September 2026
  • Home  
  • పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు
- ఖమ్మం

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో నిర్వహించారు. జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో మిరియాల రామకృష్ణ, బండి నరేష్, మల్లెల సాయి తేజ, తనూజ రెడ్డి, దాసరి రవీష్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో నిర్వహించారు. జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే అంశాలపై వివరించారు.
ఈ సమావేశంలో మిరియాల రామకృష్ణ, బండి నరేష్, మల్లెల సాయి తేజ, తనూజ రెడ్డి, దాసరి రవీష్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.