ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వెల్నెస్ సెంటర్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తెలిపారు. ఈ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో మెడికల్ ఆఫీసర్ ఒకటి, డెంటల్ రెండు, ఫిజియోథెరపీ రెండు, ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి, నర్సింగ్ ఆఫీసర్ మూడు, ఫార్మసిస్టు రెండు పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 12వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇతర వివరాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.



