Thursday, 1 October 2026
  • Home  
  • కేసీఆర్ సభ అంటే వరాల జల్లు.. రేవంత్ సభ అంటే బూతుల జల్లు: సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య.
- ఖమ్మం

కేసీఆర్ సభ అంటే వరాల జల్లు.. రేవంత్ సభ అంటే బూతుల జల్లు: సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో మాట్లాడిన తీరు దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతల నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించి నిధులు కేటాయించేవారని పేర్కొన్నారు. సిరిసిల్లలో కేసీఆర్, కేటీఆర్ చేనేత కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి వారి జీవనోపాధికి భరోసా కల్పించారని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులకు భరోసా కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించేందుకే రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చినట్లుగా ఆయన ప్రసంగం ఉందని సండ్ర వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.