బోనకల్ / ఖమ్మం
బోనకల్ మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు విరాపునేని అప్పారావు తల్లి విరాపునేని భద్రమ్మ మృతి చెందారు. వీరి యొక్క అంత్య క్రియలు రేపు ఉదయం బోనకల్ మండలం రావినూతల గ్రామం లో జరగనున్నాయి.
ఆమె మృతి పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భద్రమ్మ మృతి విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భద్రమ్మ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని గల్లా సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా సంతాపం తెలిపారు.



