వర్ధన్నపేటలో రెండు వైన్‌షాపుల్లో చోరీ.. రూ.4.25 లక్షల నగదు అపహరణ
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని రెండు వైన్‌షాపుల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి మొత్తం రూ.4.25 లక్షల నగదును అపహరించారు. మల్లికార్జున వైన్స్‌లో రూ.3.60 లక్షలు, రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో రూ.65 వేల నగదు చోరీ అయినట్లు సమాచారం.
ఒకే ప్రాంతంలో రెండు వైన్‌షాపులను దుండగులు లక్ష్యంగా చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చోరీ జరిగిన సమయంలో దుండగులు ఎలా ప్రవేశించారు? షాపుల భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? చోరీకి పాల్పడిన వ్యక్తులు స్థానికులా.. లేక బయట ప్రాంతాల నుంచి వచ్చారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో పట్టణంలో రాత్రి వేళ పోలీసుల గస్తీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వర్ధన్నపేటలో రెండు వైన్‌షాపుల్లో చోరీ.. రూ.4.25 లక్షల నగదు అపహరణవరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని రెండు వైన్‌షాపుల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి మొత్తం రూ.4.25 లక్షల నగదును అపహరించారు. మల్లికార్జున వైన్స్‌లో రూ.3.60 లక్షలు, రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో రూ.65 వేల నగదు చోరీ అయినట్లు సమాచారం.ఒకే ప్రాంతంలో రెండు వైన్‌షాపులను దుండగులు లక్ష్యంగా చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చోరీ జరిగిన సమయంలో దుండగులు ఎలా ప్రవేశించారు? షాపుల భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? చోరీకి పాల్పడిన వ్యక్తులు స్థానికులా.. లేక బయట ప్రాంతాల నుంచి వచ్చారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో పట్టణంలో రాత్రి వేళ పోలీసుల గస్తీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

