Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఘనంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జన్మదిన వేడుకలు

సిద్ధవటం మండలంలోని భాకరాపేటలో మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పత్రికా విలేఖరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు జర్నలిస్టులు హాజరై రాజేశ్వరి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజేశ్వరి రెడ్డి కేక్ కట్ చేసి విలేఖరులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం పత్రికా విలేఖరులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. తన జన్మదిన వేడుకలను విలేఖరుల ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు భగవంతుడు కల్పించారని, ప్రజల సమస్యలను తన దృష్టికి వచ్చిన మేరకు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు.ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు పత్రికా విలేఖరులు, స్థానికులు పాల్గొని రాజేశ్వరి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *