గ్రామ పరిపాలన అధికారులు (GPO) ఎదుర్కొంటున్న పని భారాన్ని తగ్గించాలని గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చీమల నాగేంద్ర బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. GPOలపై అధిక పని భారం పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సెలవు దినాల్లో విధులు నిర్వహించే పరిస్థితి లేకుండా చూడాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సర్వీస్ పరమైన అంశాలను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో GPOలు కోటేశ్వరరావు, బాల మురళి తదితరులు పాల్గొన్నారు.



