Wednesday, 30 September 2026
  • Home  
  • కేజీబీవీలో అధికారుల వరుస విచారణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేజీబీవీలో అధికారుల వరుస విచారణ

కలిగిరి: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈనెల 25న పంపిణీ చేసిన ఆహారంలో పురుగులు కనిపించాయన్న ఆరోపణలపై జిల్లా అధికారులు వరుసగా విచారణ చేపడుతున్నారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య విద్యాలయాన్ని సందర్శించి రహస్యంగా విచారణ నిర్వహించినట్లు సమాచారం. సిబ్బందితో విడివిడిగా మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిసింది. విద్యార్థినులకు అందించిన ఆహారం, ఉపాహారం, రాగిజావలో పురుగులు కనిపించాయన్న ఆరోపణలతో పాటు సిబ్బంది మధ్య ఉన్న విభేదాలపైనా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఘటనపై వాస్తవాలను నిర్ధారించేందుకు వివరాలను నమోదు చేసినట్లు తెలిసింది. విచారణ పూర్తయిన అనంతరం అధికారులు సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించే అవకాశం ఉంది. తదుపరి చర్యలపై అధికారుల నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.