ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోలలో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. అక్టోబర్ 9న నిర్వహించనున్న ఎన్నికల్లో మొత్తం 12 యూనియన్లు పాల్గొంటుండగా, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కూటమి, నేషనల్ మజ్దూర్ యూనియన్ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుర్తింపు ఎన్నికల్లో పాల్గొనే కార్మికులు రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం క్లాస్-3లో, రీజియన్ స్థాయి గుర్తింపు కోసం మరో క్లాస్-3లో ఓటు వేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఖమ్మం రీజియన్ పరిధిలో మొత్తం 1,804 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయా యూనియన్ల నాయకులు డిపోల వారీగా కార్మికులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.



