వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: మండలంలోని నందిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
- హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో రహదారి దాటుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
- ప్రమాద తీవ్రతకు ఆమె ఎగిరి పక్కనే ఉన్న సైడ్ కాలువలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
దుత్తలూరు: మండలంలోని నందిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో రహదారి దాటుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆమె ఎగిరి పక్కనే ఉన్న సైడ్ కాలువలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఉదయం సుమారు 9 గంటల సమయంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని శ్రీరాంనగర్‌కు చెందిన తోడేటి పుల్లమ్మ (55)గా గుర్తించారు. పాలు తీసుకుని తాను పనిచేసే మేకల రమణయ్య ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.