Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం!!విశేషంగా తరలివచ్చిన భక్తజనం!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం!!విశేషంగా తరలివచ్చిన భక్తజనం!!

పామూరు, నవంబర్ 28@5:12 pm (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు పట్టణానికి కూతవేటు దూరంలో విరువూరు గ్రామ సరిహద్దు ప్రాంతంలో, ప్రశాంత వాతావరణంలో విలసిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు విశేష పూజకార్యక్రమాలు జరిగిపుకొని, గ్రామప్రజలకు, దూరప్రాంత ప్రజలకు, దాతల సహాయ సహకారంతో ఈరోజులాగే ప్రతి శనివారం మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.. ఈసందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయధర్మకర్తలు పాత్రికేయ మిత్రులతో, మాట్లాడటం జరిగింది.. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ,, గతకొన్ని సంవత్సరాలనుండి ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీర్వాదాలతో తీర్ధప్రసాదలు స్వీకరించి స్వామివారి కృపకు, కరుణాకటాక్షాలకు పాత్రులవుతున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.. ప్రతి శనివారము లాగే, మంగళవారం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.. కార్తీకమాసం మాసం కావడం వల్ల ప్రతి శనివారం వచ్చే భక్తులతో పాటు, అయ్యప్ప మాల ధారకులు కూడా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నివాసముంటున్నారని, ఉదయం పూట మంగళ స్థానాలు చేస్తూ,శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలోని కార్తీకమాసం పూర్తి దినాలు ఉంటారని ఆలయ కమిటీ చైర్మన్ తెలియజేశారు..

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం!!విశేషంగా తరలివచ్చిన భక్తజనం!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *