ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం చిన్న నాగంపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ జడ్పీటీసీ సభ్యుడు దుగ్గిరెడ్డి గురువారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులతో కుమ్మక్కై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందున చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సస్పెన్షన్ సమాచారాన్ని జిల్లా, కేంద్ర పార్టీ కార్యాలయాలకు కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు
