Sunday, 6 September 2026
  • Home  
  • వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు
- ఆంధ్రప్రదేశ్

వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు

విశాఖపట్నం జూన్3 (పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్): అనకాపల్లి జిల్లా ర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నవేసవి శిక్షణ శిబిరాన్ని బుధవారం ఉమ్మడి జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు పి. ప్రభాకర్ సైకిల్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు విద్యార్థులకు తెలియజేస్తూ, తాను సైకిల్ పై ఢిల్లీకి చేసిన సాహస యాత్రను విద్యార్థులకు వివరించారు. ఆరోజు పొందిన ప్రశంసా పత్రం, పత్రికా ప్రచురణలను ప్రదర్శించారు. తురకబడి ఉన్నత పాఠశాల చిత్రలేఖనం ఉపాధ్యాయుడు గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ బి. ఎస్ . ప్రసాద్ మాస్టర్ ఆధ్వర్యంలో సీనియర్, జూనియర్స్ విభాగాలలో చదరంగం పోటీలను నిర్వహించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి . కుమార్ రాజు గ్రంథాలయాన్ని సందర్శించి, విద్యార్థులు ఆట తీరును పరిశీలించారు. అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషమని అన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ ఉద్దరాజు సూర్యనారాయణ రాజు, హైకోర్టు లాయర్ సాయి తేజ గ్రంధాలయంకు బహుకరించిన పుస్తకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా, చక్కగా వేసవి శిక్షణ శిబిరన్ని నిర్వహిస్తున్న గ్రంథాలయ అధికారిణి పి. దమయంతిని అభినందించారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారితో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ముచ్చటించారు. వారికి అవసరమైన పుస్తకములను త్వరలో సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శి బుర్రి కుమార్ రాజు

విశాఖపట్నం జూన్3 (పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్): అనకాపల్లి జిల్లా ర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నవేసవి శిక్షణ శిబిరాన్ని బుధవారం ఉమ్మడి జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు పి. ప్రభాకర్ సైకిల్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు విద్యార్థులకు తెలియజేస్తూ, తాను సైకిల్ పై ఢిల్లీకి చేసిన సాహస యాత్రను విద్యార్థులకు వివరించారు. ఆరోజు పొందిన ప్రశంసా పత్రం, పత్రికా ప్రచురణలను ప్రదర్శించారు. తురకబడి ఉన్నత పాఠశాల చిత్రలేఖనం ఉపాధ్యాయుడు గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ బి. ఎస్ . ప్రసాద్ మాస్టర్ ఆధ్వర్యంలో సీనియర్, జూనియర్స్ విభాగాలలో చదరంగం పోటీలను నిర్వహించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి . కుమార్ రాజు గ్రంథాలయాన్ని సందర్శించి, విద్యార్థులు ఆట తీరును పరిశీలించారు. అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషమని అన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ ఉద్దరాజు సూర్యనారాయణ రాజు, హైకోర్టు లాయర్ సాయి తేజ గ్రంధాలయంకు బహుకరించిన పుస్తకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా, చక్కగా వేసవి శిక్షణ శిబిరన్ని నిర్వహిస్తున్న గ్రంథాలయ అధికారిణి పి. దమయంతిని అభినందించారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారితో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ముచ్చటించారు. వారికి అవసరమైన పుస్తకములను త్వరలో సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

కార్యదర్శి బుర్రి కుమార్ రాజు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.