====================
అండర్–19 విభాగంలో ఎం. అనురాధకు ద్వితీయ స్థానం.. విద్యార్థినిపై అభినందనల వెల్లువ!
విశాఖపట్నం జిల్లా,(పున్నమి ప్రతినిధి) అక్టోబర్ 24,:
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొమ్మాదిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో **కేజీబీవీ ఆనందపురం** విద్యార్థిని **ఎం. అనురాధ అండర్–19 ట్రిపుల్ జంప్ విభాగంలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది*జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయికి చేరుకున్న అనురాధ, అక్కడ కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు
ఈ విజయంపై కేజీబీవీ ఆనందపురం ప్రిన్సిపాల్ **శ్రీమతి దొండా చంద్రకళ** హర్షం వ్యక్తం చేస్తూ అనురాధను అభినందించారు. విద్యార్థినిలోని క్రీడా ప్రతిభను గుర్తించి, శిక్షణ అందించిన **పీ.ఈ.టీ. బి. రమాదేవి** కృషిని కూడా ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
పేరెంట్స్ కమిటీ చైర్మన్, k. పావని. వైస్ చైర్మన్ వరలక్ష్మి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు అనురాధకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
**రెండో స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అనురాధ విజయం కేజీబీవీ ఆనందపురానికి గర్వకారణంగా నిలిచింది.** విద్యార్థినులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.
ఈ వివరాలను పీ.ఈ.టీ. **బి. రమాదేవి** తెలియజేశారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్