వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్ అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: నవరాత్రుల సందర్భంగా నిర్మల్‌లోని మహాలక్ష్మి వాడలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ అన్నదాతగా విరాళం అందించారు.
- ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
- సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, మత సామరస్యానికి పండుగలు ప్రతీకలని, అందరూ కలిసి పండుగలు జరుపుకున్నప్పుడే నిజమైన ఆనందం, ఐక్యత వెల్లివిరుస్తాయని అన్నారు.
నిర్మల్ అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: నవరాత్రుల సందర్భంగా నిర్మల్‌లోని మహాలక్ష్మి వాడలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ అన్నదాతగా విరాళం అందించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. సయ్యద్ హైదర్ మాట్లాడుతూ, మత సామరస్యానికి పండుగలు ప్రతీకలని, అందరూ కలిసి పండుగలు జరుపుకున్నప్పుడే నిజమైన ఆనందం, ఐక్యత వెల్లివిరుస్తాయని అన్నారు. మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైండ్ల శ్రీనివాస్, వసంతరావు, మెరుగు రాజన్న, మాతా దీక్ష తీసుకున్న గోల్కొండ రాజమణి, రవి, సోషల్ వర్కర్ సాజిద్‌తో పాటు కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.