వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, అక్టోబర్ 16: మనుబోలు మండలంలోని సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ తన బృందంతో కలిసి ఈరోజు పరిశీలించారు.
- ఈ సందర్భంగా రాజవోలపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
- ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, అక్టోబర్ 16: మనుబోలు మండలంలోని సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ తన బృందంతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజవోలపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలను పరిశీలించి, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలపై దృష్టి సారించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.