ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించాలి: సర్పంచ్ గొంది సుజాత–నాగేశ్వరరావు
ఖానాపురం పున్నమి ప్రతినిధి:.మంగళవారిపేట భూగర్భ జలాల పెంపునకు, భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సర్పంచ్ గొంది సుజాత–నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
మంగళవారిపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శితో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించాలని, ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ సమిష్టిగా భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూషబోయిన రాజు యాదవ్, పంచాయతీ కార్యదర్శి పోశాల యుగేందర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉప్పల వీరబాబు, వార్డు సభ్యులు గొంది నర్సయ్య, చెన్నబోయిన భాగ్య–వీరన్న, లావుడ్యా నిర్మల, తాళ్లపెళ్లి కవిత–కమలాకర్, మూడు వీరన్న, ఫీల్డ్ అసిస్టెంట్ పులిగిల్ల శ్రీశైలం, నాగినబోయిన రమేష్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
