Saturday, 19 September 2026
  • Home  
  • బెట్టింగ్‌ డబ్బుల విత్‌డ్రా పేరుతో మోసం ఆరోపణ
- BHADRADRI

బెట్టింగ్‌ డబ్బుల విత్‌డ్రా పేరుతో మోసం ఆరోపణ

బద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 18,(పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం: క్రికెట్‌ బెట్టింగ్‌లో గెలిచిన నగదును విత్‌డ్రా చేసుకునే క్రమంలో మోసం జరిగిందని ఓ బాధితుడు ఆరోపించాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో గెలిచిన అనంతరం డబ్బుల విత్‌డ్రా కోసం నిర్వాహకులను సంప్రదించగా, 5 నిమిషాల్లో లేదా 30 నిమిషాల్లో నగదు ఖాతాలో జమ అవుతుందని చెప్పినట్లు తెలిపాడు. అయితే విత్‌డ్రా ప్రక్రియ పేరుతో అదనంగా రూ.10 వేల వరకు చెల్లించాలని కోరినట్లు పేర్కొన్నాడు. వారు చెప్పిన ప్రకారం నగదు చెల్లించిన అనంతరం తన ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశారని ఆరోపించాడు. లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, చెల్లింపు వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. ఈ ఘటనతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు, వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

బద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 18,(పున్నమి ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం: క్రికెట్‌ బెట్టింగ్‌లో గెలిచిన నగదును విత్‌డ్రా చేసుకునే క్రమంలో మోసం జరిగిందని ఓ బాధితుడు ఆరోపించాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో గెలిచిన అనంతరం డబ్బుల విత్‌డ్రా కోసం నిర్వాహకులను సంప్రదించగా, 5 నిమిషాల్లో లేదా 30 నిమిషాల్లో నగదు ఖాతాలో జమ అవుతుందని చెప్పినట్లు తెలిపాడు. అయితే విత్‌డ్రా ప్రక్రియ పేరుతో అదనంగా రూ.10 వేల వరకు చెల్లించాలని కోరినట్లు పేర్కొన్నాడు. వారు చెప్పిన ప్రకారం నగదు చెల్లించిన అనంతరం తన ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశారని ఆరోపించాడు. లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, చెల్లింపు వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. ఈ ఘటనతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు, వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.