Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బాధిత కుటుంబానికి అండగా ఖానాపురం మండల యాదవ సంఘం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాధిత కుటుంబానికి అండగా ఖానాపురం మండల యాదవ సంఘం

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపురం: మండలంలోని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు యాదవ్ మృతి పట్ల ఖానాపురం మండల యాదవ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
యాదవ సంఘం అధ్యక్షులు పులిగిల్ల యాదగిరి యాదవ్ మాట్లాడుతూ.. బాలరాజు యాదవ్ మృతి ఎంతో బాధాకరమని, ఈ కష్ట సమయంలో యాదవ సంఘం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన దోషులను వెంటనే గుర్తించి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి అండగా నిలిచే ఉద్దేశంతో ఖానాపురం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అవసరమైన సమయంలో సంఘం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
పరామర్శించిన వారిలో: సర్పంచ్ శ్రీలత అశోక్ యాదవ్, మాజీ సర్పంచ్ బుస రమ అశోక్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఊడ్గుల రాజు యాదవ్, కోడి మల్లేష్ యాదవ్, కోశాధికారి మీరాల సోమయ్య యాదవ్, వంగ సుమన్ యాదవ్, వల్లపు ఐలోని యాదవ్, వరదయ్య యాదవ్, కొండ శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఖానాపురం మండల యాదవ సంఘం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *